ఏడో వార్డులో జోరుగా టీడీపీ ప్రచారం
NEWS Oct 27,2026 01:50 pm
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు ఏడో వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ముద్దర్ల లక్ష్మీదేవి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను నేరుగా కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని లక్ష్మీదేవి హామీ ఇచ్చారు.