‘వారణాసి’ కథనం చెప్పిన రాజమౌళి
NEWS Oct 27,2026 01:12 pm
రాజమౌళి - మహేశ్ మూవీ ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు. తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమా కథాంశం తెలిపారు. కాలంలో వెనక్కి ప్రయాణించడంతో పాటు విభిన్న ప్రపంచాల మధ్య సాగే సాహసయాత్రగా ఉంటుందని, భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక విజువల్స్‌తో పాటు తండ్రీకొడుకుల అనుబంధం, కుటుంబ భావోద్వేగాలు కథకు ప్రధాన బలంగా నిలుస్తాయని చెప్పారు. ఇందులో మహేశ్‌బాబు ‘రుద్ర’గా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా నటించారు.