వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
NEWS Oct 27,2026 01:49 pm
హనుమకొండ: రామాయణ మహాకావ్యాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహర్షి వాల్మీకి కేవలం కవి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, ధర్మ మూలాలకు వెలుగునిచ్చిన మార్గదర్శి అని కలెక్టర్ పేర్కొన్నారు.