వైసీపీపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు
NEWS Oct 27,2026 11:10 am
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు గిద్దలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరగనివ్వలేదని ఆరోపిస్తూ, ప్రస్తుతం నామినేషన్లకు అవకాశం కల్పించినప్పటికీ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.