మార్కాపురం: స్థానిక మార్కెట్ యార్డులో జిల్లా ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అధ్యక్షతన కూటమి ప్రజాప్రతినిధుల సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలు, జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. కూటమి నేతలంతా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.