షార్ట్ సర్క్యూట్తో వరిగడ్డి దగ్ధం
NEWS Oct 27,2026 01:13 pm
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అనుమలీడు వెళ్లే మార్గంలో వరిగడ్డి అగ్నికి ఆహుతైంది. రాజమ్మ అనే రైతు పొలంలో నిల్వ ఉంచిన వరిగడ్డి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో సుమారు రూ.20 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు రాజమ్మ తెలిపారు.