విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
NEWS Oct 27,2026 09:23 am
విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ టి.శాస్త్రి అన్నారు.2026-27 విద్యా సంవత్సరానికి దక్షిణ జోన్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలను కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ప్రాంగణంలో నిర్వహించారు.బెస్ట్ ఫిజిక్, మహిళలు,పురుషులు హెవీ వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఎంపికలు చేపట్టినట్లు టీ. శాస్త్రి తెలిపారు.3 ఉమ్మడి జిల్లాల నుంచి బెస్ట్ ఫిజిక్ లో 15 మంది,మహిళా విభాగంలో 30 మంది, పురుషుల విభాగంలో 45 మంది పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.