బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి
NEWS Oct 27,2026 09:25 am
బాల్య వివాహాలు,బాల కార్మిక వ్యవస్థను అరికట్టి బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ అనిత రెడ్డి అన్నారు. హనుమకొండ ప్రభుత్వ స్వాదర్ హోమ్ ను అనిత రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా మహిళలు, పిల్లలకు పౌష్టిక ఆహారం, విద్య,మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు. బాలికలు విద్య అభివృద్ధి, మహిళా సాధికారత,బాలల హక్కుల పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం వారికి పనులు పంపిణీ చేశారు.