ఓటర్లను ఆకర్షిస్తున్న డాక్టర్ జేవీ నారాయణ
NEWS Oct 27,2026 09:24 am
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జేవీ నారాయణ వినూత్న రీతిలో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దోశలు వేస్తూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థించారు. సాధారణ వ్యక్తిలా టిఫిన్ సెంటర్‌లో దోశలు వేస్తూ ప్రచారం నిర్వహించడం పట్టణంలో ఆసక్తికరంగా మారింది. ఆయన వినూత్న ప్రచారం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది.