అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి
NEWS Oct 27,2026 09:23 am
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి అంశాన్ని పక్కగా నమోదు చేయాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో హనుమకొండ జిల్లా నుంచి కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి పలువు అధికారులు పాల్గొన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.