జాతీయస్థాయిలో అవార్డు దక్కడం గర్వకారణం
NEWS Oct 27,2026 01:13 pm
వరంగల్ కు జాతీయస్థాయిలో అవార్డు దక్కడం గర్వకారణం అని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండలోని కుడా కార్యాలయంలో వరంగల్ నగరానికి జాతీయ అవార్డు రావడం పట్ల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి చహత్ బాజ్ పాయ్ ను సుధారాణి అభినందించారు. జాతీయస్థాయి అర్బన్ కాంక్లేవ్ లో నాన్ మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో వరంగల్ నగరానికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.