కథలాపూర్ మండలంలో రీ సర్వే ప్రారంభం
NEWS Oct 24,2026 09:44 pm
కథలాపూర్ మండలంలోని పెగ్గర్ల గ్రామంలో శనివారం రీ సర్వే తహసిల్దార్ రమేష్ గౌడు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ అతి తొందరలోనే అన్ని గ్రామాలు సర్వే పూర్తి చేస్తామని, దీనికి రైతులు ప్రతి ఒక్కరు తమ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సాయిలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్, సోహెల్ జిపిఓ శ్రీనివాస్, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.