గిద్దలూరు ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన
NEWS Oct 24,2026 09:44 pm
గిద్దలూరు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల నామినేషన్ ఫారాల పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. గిద్దలూరు మండలంలోని 14 ప్రాదేశిక స్థానాలకు సంబంధించి దాఖలైన 35 నామినేషన్ ఫారాలు పరిశీలనలో చెల్లుబాటైనట్లు రిటర్నింగ్ అధికారి ఎ. పాండురంగారెడ్డి, సహాయ ఎన్నికల అధికారులు జి.వి. మోహన్ కుమార్, తహసీల్దార్ టి. ఫణీంద్రుడు తెలిపారు.