‘ఫౌజీ’ పోస్టర్‌తో ప్రభాస్ బర్త్‌డే ట్రీట్
NEWS Oct 23,2026 10:12 am
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘ఫౌజీ’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మిలటరీ అధికారిగా ప్రభాస్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. అగ్నిజ్వాలల మధ్య బంగారు నాణెంపై ఆయన సైడ్ ప్రొఫైల్‌ను చూపిస్తూ రూపొందించిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. “ఫైల్ నం. 25 డీక్లాసిఫై చేస్తున్నాం”, “అతను ఎవరు?” వంటి క్యాప్షన్లతో మేకర్స్ ఉత్కంఠను పెంచారు. ఈ ప్రశ్నకు సమాధానంగా వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ డ్రామా చరిత్రలో మరుగునపడిన ఓ సైనికుడి కథతో రూపొందుతున్నట్లు సమాచారం.