సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం
NEWS Oct 21,2026 09:13 pm
టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగాల సమన్వయంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. అక్టోబర్ 12 నుంచి 20 వరకు జరిగిన ఉత్సవాల్లో దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు పేర్కొన్నారు. అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తుల సమిష్టి కృషితో ఉత్సవాలు సజావుగా సాగాయని తెలిపారు. భారీ వర్షం కురిసినప్పటికీ గరుడసేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.