ఎన్నికల కోడ్.. సిఫార్సు లేఖలకు నో
NEWS Oct 21,2026 09:12 pm
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున తిరుమలలో శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించరు. స్వయంగా తిరుమలకు వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే నిబంధనల మేరకు దర్శనం, వసతి కల్పిస్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంతకాలం ఈ నిబంధనలు వర్తిస్తాయని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.