విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రల్లో రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ‘రణబాలి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్, ఆయన భార్య జయమ్మగా రష్మిక నటన ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన శింగనమల సెట్‌లో దసరా పర్వదినం సందర్భంగా ఈ సెట్లో విజయ్-రష్మిక దంపతులు తమ అభిమానులతో కలసి సందడి చేశారు. విజయ్ గుర్రం మీద వచ్చాడు. మహిళలతో కలసి రష్మిక, విజయ్ బతుకమ్మ ఆడారు. అభిమానులతో మనసు విప్పి మాట్లాడారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కూడా పాల్గొన్నారు.