వివాదాలతో వార్తల్లో నిలిచే ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమె నటించిన ‘భామ సుందరాలో’ జానపద గీతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా విడుదలైన ఈ పాట కొద్ది సమయంలోనే మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ పాటలో మాధురి తన ప్రియుడు సాయితో కాకుండా వెంకట్ అజ్మీరాతో కలిసి ఆడి పాడారు. రామస్వామి సాహిత్యం, వెంకట్ అజ్మీరా సంగీతం సమకూర్చారు. శేఖర్ వైరస్ నృత్యరీతులు రూపొందించగా, నరసింహులు, ముకుంద పాటను ఆలపించారు. మాధురి నృత్యం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.