పోలేరమ్మ ఆలయానికి భక్తుల పోటెత్తు
NEWS Oct 20,2026 04:24 pm
మార్కాపురం: విజయదశమి పండుగ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.