గొల్లపాలెం–రాళ్లపాడు రహదారి అధ్వానం
NEWS Oct 20,2026 04:24 pm
ప్రకాశం జిల్లా: గుడ్లూరు మండల పరిధిలోని గొల్లపాలెం తాడిచెట్టు నుంచి రాళ్లపాడు వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రెండు బస్సులు నడిచే ఈ మార్గంలో ప్రస్తుతం ఒక్క బస్సే నడుస్తుండటంతో విద్యార్థులు, కూలీలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టడంతో పాటు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.