గిద్దలూరులో చైర్మన్ పీఠంపై ఉత్కంఠ!
NEWS Oct 20,2026 04:23 pm
గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి చైర్మన్ పదవి కేటాయించగా, డాక్టర్ జె.వి. నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్ టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్గా 3 సెట్ల నామినేషన్లు వేశారు. మరోవైపు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బీజేపీ పెద్దలు, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు బీటీ నాయుడుతో పలుమార్లు చర్చలు నిర్వహించారు. రేపే నామినేషన్లకు చివరి తేదీ కావడంతో తుది అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది.