టీడీపీలోకి 50 వైసీపీ కుటుంబాలు
NEWS Oct 20,2026 09:39 am
కొమరోలు మండలం గుంద్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిజ్జం రవీంద్రనాథ్‌రెడ్డి, బిజ్జం వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికలతో దద్దవాడ పంచాయతీ పరిధిలో టీడీపీకి మరింత బలం చేకూరిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.