ఉద్యోగినులకు బతుకమ్మ కానుకలు
NEWS Oct 17,2026 06:39 pm
హైదరాబాద్: బతుకమ్మ పండుగను పురస్కరించు కుని సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు తెలంగాణ సాంస్కృతిక శాఖ తరఫున బతుకమ్మ కానుకలను పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంస్కృతిక శాఖ సెక్షన్ ఆఫీసర్ గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ చేతుల మీదుగా మహిళా ఉద్యోగినులందరికీ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా కానుకలు అందుకున్న మహిళా ఉద్యోగినులు సాంస్కృతిక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.