ఈ ప్రతిపాదనలను త్వరగా పరిష్కరించాలి
NEWS Oct 24,2026 10:02 pm
బాధిత ఎస్సీ, ఎస్టీలకు పరిహారం త్వరగా అందించేవిధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో తీర్మానించిన ప్రతిపాదనలను సంబంధిత ప్రభుత్వ శాఖలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
ప్రతి నెల 30వ తేదీన సివిల్ రైట్స్ డే ను నిర్వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు.