మహిళా సంక్షేమానికి పెద్దపీట
NEWS Oct 24,2026 10:02 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు వెళుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 200 మంది అరులైన ముస్లిం మైనారిటీలకు ఎమ్మెల్యే ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.