గిద్దలూరు వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా భూమా
NEWS Oct 17,2026 02:37 pm
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డిని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నూతనంగా ఏర్పాటైన గిద్దలూరు మున్సిపాలిటీలో జరగనున్న తొలి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జి కుందూరు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. గిద్దలూరు మున్సిపల్ పీఠంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ప్రజలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.