గిద్దలూరులో తొలిరోజు నామినేషన్లు నిల్
NEWS Oct 17,2026 08:04 pm
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు అసిస్టెంట్ ఎన్నికల అధికారి రమణబాబు తెలిపారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన సదుపాయాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.