మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
NEWS Oct 16,2026 09:00 am
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, కౌసల్యా దేవి ఫౌండేషన్ చైర్మన్ జ్ఞాన ప్రకాష్ రెడ్డి తదితరులు మధు యాష్కీ గౌడ్‌ను కలిసి అభినందనలు తెలియజేసి సన్మానించారు.