సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి
NEWS Oct 15,2026 09:04 pm
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా విహరించి భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు గజరాజులు నడవగా, చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టి, మంగళవాయిద్యాల నడుమ సేవ అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.