గిద్దలూరు: సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు
NEWS Oct 15,2026 08:34 pm
గిద్దలూరు మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు 2026 రెండో విడత సాధారణ ఎన్నికల సర్పంచ్ రిజర్వేషన్లు ప్రకటించారు. దిగువమెట్ట తండా ఎస్టీ మహిళకు, సంజీవ్ రావు పేట ఎస్సీకి, ముండ్లపాడు బీసీకి, తిమ్మాపురం, ఉయ్యాలవాడ, అంబవరం బీసీ మహిళలకు కేటాయించారు. మిగిలిన గ్రామాలకు అన్రిజర్వ్డ్, ఎస్సీ, బీసీ కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. రిజర్వేషన్ల ప్రకటనతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.