నల్లగొండలో జరుగుతున్న పీఆర్టీయూ రాష్ట్ర
కౌన్సిల్ సమావేశంలో రాయికల్ సభ్యులు
NEWS Oct 15,2026 08:34 pm
నల్లగొండ: పీఆర్టీయూ ఆరో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నల్లగొండలో ప్రారంభమయ్యాయి. 72 వేల మంది సభ్యులున్న ఈ సంఘ సమావేశంలో పీఆర్సీ అమలు, సర్వీస్ రూల్స్ సమస్యల పరిష్కారం, సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశాలకు జగిత్యాల జిల్లా రాయికల్ నుంచి పీఆర్టీయూ సభ్యులు పొన్నం రమేష్, మల్లారెడ్డి, రాజేశం, నరసయ్య, గంగరాజము, రాజారెడ్డి పాల్గొన్నారు.