గిద్దలూరులో ఎన్నికల కోడ్ అమలు
NEWS Oct 15,2026 08:32 pm
గిద్దలూరు: మున్సిపాలిటీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, ప్రచార సామగ్రిని తొలగించడంతో పాటు విగ్రహాలకు ముసుగులు వేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిబంధనలు అమలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణబాబు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు తావులేకుండా పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కోడ్ అమల్లో ఉన్నంతకాలం ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని అధికారులు సూచించారు.