గిద్దలూరు TDPలో చైర్మన్ పీఠంపై IVR సర్వే!
NEWS Oct 15,2026 08:31 pm
గిద్దలూరు: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దప్పిలి కాశిరెడ్డి, దప్పిలి రంగారెడ్డి, కమతం శీను, పసుపులేటి శ్రీనివాసులు, ముత్తుముల కృష్ణ కిషోర్ పేర్లతో ఐవీఆర్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో గిద్దలూరులో రాజకీయ చర్చ వేడెక్కింది. ఐదుగురు ఆశావహుల్లో ప్రజల మద్దతు ఎవరికి లభిస్తుంది? ప్రజాభిప్రాయ సేకరణకు పార్టీ అధిష్ఠానం ఎంత ప్రాధాన్యం ఇస్తుంది? చివరకు చైర్మన్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుందన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. టీడీపీ అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.