దసరా వేళ డాక్టర్ జయశ్రీ ఆప్యాయత
NEWS Oct 15,2026 08:29 pm
నిర్మల్: దసరా పండుగ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని మస్తాన్ దుప్ప ప్రాంతంలోని వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ జయశ్రీ వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. పండుగ వేళ అవ్వాతాతల మధ్యకు వెళ్లి వారితో ఆప్యాయంగా మాట్లాడి, వస్త్రాలు అందజేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్న వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె తెలిపారు. పండుగ అంటే కొత్త బట్టలు ధరించడమే కాకుండా, ఆప్యాయతను పంచుకోవడం, ఆత్మీయతను అందించడమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. దసరా వేళ వృద్ధులతో ఆనందాన్ని పంచుకున్న డాక్టర్ జయశ్రీ సేవాభావాన్ని పలువురు అభినందించారు.