గిద్దలూరు మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ
NEWS Oct 17,2026 08:08 pm
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీలో ఎన్నికల వేడి మొదలైంది. గతంలో నగర పంచాయతీగా ఉన్న సమయంలో 2016, 2021 ఎన్నికల్లో బీసీ జనరల్ కేటాయింపు ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2026 ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠం అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించే అవకాశం ఉందన్న సమాచారంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీల్లో చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.