ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
NEWS Oct 10,2026 03:42 pm
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు నిర్ణయించారు. పంచాయతీ వార్డు సభ్యులకు 26.73%, సర్పంచ్‌లకు 27.95%, MPTCలకు 25.55%, MPPలకు, ZPTCలకు 24.60%, జడ్పీ చైర్‌పర్సన్లకు 23.08% రిజర్వేషన్లు కేటాయించారు. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులకు 32.78%, మున్సిపల్ చైర్‌పర్సన్లకు 32.03%, మేయర్లకు 35.02% రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు మంత్రులు తెలిపారు.