ఘనంగా శ్రీజీయర్ స్వామివారి పాదపూజ
NEWS Oct 03,2026 08:01 pm
నిర్మల్: నటరాజనగర్‌లోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమడ శ్రీధర్ నివాసంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ షఠగోప ముని రామానుజ జీయర్ స్వామివారి పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో పాదపూజ జరిపారు. అనంతరం భక్తులకు తీర్థగోష్ఠి, అనుగ్రహ భాషణం, ఆశీర్వచనం అందించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఆస్తిక మహాశయులు తరలివచ్చి జీయర్ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.