అబూబకర్ సిద్ధిఖ్‌కు అభినందనలు
NEWS Sep 24,2026 05:34 pm
ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్ కుమారుడు మొహమ్మద్ అబూబకర్ సిద్ధిఖ్ నీట్–యూజీ 2026లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి, తెలంగాణ కన్వీనర్ కోటాలో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మెరిట్ సీటు సాధించారు. ఈ సందర్భంగా మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్‌తో పాటు సభ్యులు ఆయనను అభినందించారు. వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భవిష్యత్తులో మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు పేదలు, సామాన్య ప్రజలకు సేవలందించి మెట్‌పల్లి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.