సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు చుక్కెదురైంది. అనర్హత వేటు విషయంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దానంను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఒక పార్టీ నుంచి గెలిచి.. మరో పార్టీ తరఫున పోటీ చేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది. ఘర్‌వాపసీ చట్టసభ సభ్యులకు వర్తించదని, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యం కానుంది.