TG: ఇంటి వద్దకే 'మీ సేవ' సర్వీసులు
NEWS Sep 23,2026 11:41 pm
ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు పేరిట మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసినా లేదా మీసేవ పోర్టల్ ద్వారా స్లాట్‌ను బుక్ చేసుకుంటే.. మీసేవ ఎగ్జిక్యూటివ్ ఇంటి వద్దకే వస్తార, ఇంటివద్దనే.. జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, EC కాపీలు, పోలీసు శాఖ సేవలు, IGRS రిజిస్ట్రేషన్లు.. ఇలా ‘మీ సేవ’ ద్వారా పౌర సేవలు అందిస్తారని చెప్పారు. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, మీ సేవ VLEలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.