ఆయుర్వేదం ప్రాచీనం వైద్య విధానం
NEWS Sep 23,2026 11:42 pm
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనం భారతీయ ఆయుర్వేద వైద్య విధానం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హనుమకొండలో ఆయుర్వేద మెగా శిబిరం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ఆయుర్వేద మెగా క్యాంప్‌ను ప్రారంభించారు. భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో అనేక వైద్య విధానాలు ప్రజల విశ్వాసాన్ని పొంది ఉన్నాయని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఆయుర్వేదం గొప్పదనం, విశిష్టత, మానవాళిని రక్షించడంలో ఆయుర్వేదం అందించిన సేవల గురించి వివరించారు.