బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా గణేశ్ మండపాన్ని సందర్శించారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, మేనేజర్ పూజా దద్లానితో కలిసి గణనాథుడికి పూజలు నిర్వహించారు. భారీ భద్రత మధ్య మండపానికి చేరుకున్న షారుఖ్.. క్యూలో ఉన్న అభిమానులకు అభివాదం చేశారు. అంతకుముందు అంబానీ కుటుంబం నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లోనూ షారుఖ్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ‘కింగ్’ చిత్రంలో నటిస్తున్నారు.