మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
NEWS Sep 22,2026 10:31 pm
హనుమకొండలోని పెద్దమ్మగడ్డ కాలనీకి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పెద్దమ్మగడ్డ ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన ప్రాంతంగా ఉందన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారే తప్ప, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు.