భిక్షాటన రహితంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ
NEWS Sep 22,2026 08:55 pm
వరంగల్ నగరాన్ని భిక్షాటన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా భీమారంలోని పునరావాస కేంద్రాన్ని కమిషనర్ వెంకన్న మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. భిక్షాటన నుంచి పునరావాసం పొందుతున్న వారికి అందుతున్న వసతి, భోజనం, వైద్య సేవలను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.