కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి
NEWS Sep 22,2026 08:54 pm
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంపీ కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 100 పడుకుల ఆసుపత్రి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.