ఘనంగా పి. నర్సారెడ్డి జయంతి వేడుకలు
NEWS Sep 22,2026 07:13 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ రాజేశ్వర్ ఆధ్వర్యంలో నర్సారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో పి. నర్సారెడ్డి అందించిన సేవలను కొనియాడారు. ప్రజా సేవలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.