అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రానికి గిన్నిస్ రికార్డ్
NEWS Sep 21,2026 08:12 pm
అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'రాకా' మూవీ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. "మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్-టైమ్" (ఒకే సమయంలో అత్యధిక మందిని మోషన్ క్యాప్చర్ చేయడం) విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఒకేసారి 37 మంది పెర్ఫార్మర్లతో రియల్ టైమ్ మోషన్ క్యాప్చర్‌ను ఏకకాలంలో చిత్రీకరించి ఈ ఘనత సాధించినట్లు తెలిపింది. అల్లు అర్జున్, అట్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.