యువ ఆపదమిత్ర స్కీంలో ఉపాధ్యాయురాలికి శిక్షణ
NEWS Sep 21,2026 08:02 pm
జగిత్యాల: మంచిర్యాల జిల్లా గుడిపేటలోని 13వ బెటాలియన్ TGSPలో NDRF ఆధ్వర్యంలో SDRF నిర్వహిస్తున్న యువ ఆపదమిత్ర స్కీం శిక్షణలో జగిత్యాల జిల్లా జగన్నాథ్‌పూర్ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ఉపాధ్యాయురాలు వేల్పుల శిరీష పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న శిక్షణలో అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, భవనాలు కూలినప్పుడు బాధితులను రక్షించే పద్ధతులు, ప్రాథమిక చికిత్స, సీపీఆర్, రక్షణ పరికరాల వినియోగంపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. విపత్తుల వేళ తక్షణమే స్పందించి ప్రాణాలను కాపాడేలా శిక్షణ పొందుతున్నట్లు శిరీష తెలిపారు.