రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
NEWS Sep 21,2026 08:12 pm
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు.స్థానికుల వివరాల ప్రకారం మహబూబాబాద్ పట్టణంలోని నందినగర్ కు మాలతి(51) భవానినగర్ తండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.గత నెల 13న పాఠశాలకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ కిందపడి కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమె మృత్తి పట్ల పలువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు.