క్రీడాకారిణికి అండగా నిలిచిన యువత
NEWS Sep 21,2026 08:12 pm
హనుమకొండ నగరానికి చెందిన దివ్యాంగురాలు కావేరి జ్యోతి శ్రీలంక దేశంలో జరగనున్న అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యారు.ఆమె ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న పలువురు యువకులు సోమవారం ఆమెకు రూ.45వేల ఆర్థిక సహాయం అందించి చేయూతగా నిలిచారు. ఈ సందర్భంగా కావేరి జ్యోతి వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అందించిన సహకారం మరువలేనిదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చందు,కిరణ్, రాహుల్ తదితరులు ఉన్నారు.